కంట తడి పెట్టిస్తున్న balagam cinema పాట
అవును… కంట తడి పెట్టిస్తున్న బలగం సినిమా(balagam cinema) పాట !!! చాల రోజుల తరువాత …సొంత భావాలు తో రాస్తున్న blog ఇది.. మనుసు లోతులోంచి వస్తున్న… భావజాలం … ఈ మధ్యకాలం లో … నన్ను కదిలించిన సినిమా “బలగం”.. సినిమా లో బాగా ఆకట్టుకున్న అంశం ఏంటి అంటే …. క్లైమాక్స్ పాట …. “బలరామ నర్సయ్య యో… బలరామ నర్సయ్య పాట … ఈ విషయం లో నన్ను ఆకట్టుకున్నది …కాసర్ల శ్యామ్ అన్న రచన … అన్న నీకు వేల ..వేల దండాలన్న… ఏమి రాసినవే పాట ని …
“నన్ను కదిలించిన లైన్ ఏంటి అంటే “తోడురాని మంది కోసం తిప్పలెన్ని మోసినవో”.
ఈ పాట రోజు కి ఒక్క సారి అయినా టీవీ లో చూస్తూ ఉంటె … ఆటోమేటిక్ గా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి… ఒక మనిషి చనిపోయినప్పుడు తనని గుర్తు చేసే అతి కొద్దీ సాంగ్స్ లలో నీ పేరు నిలుపుకున్నావ్ అన్న,. వేటూరి గారు రాసిన “చుక్కల్లోకెక్కినాడు సక్కనోడు“… సరసన చేరారు .
ఇలాంటి పాట అందించిన “కాసర్ల శ్యామ్ అన్న కు , ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి … డైరెక్టర్ వేణు గారికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారికి ధన్యవాదాలు…
మరిన్ని songs తెలంగాణ యాసలో …ఇలాంటి ఆణిముత్యాలు మీ కలం ని రావాలి అని కోరుకుంటూ మీ blogtelugu అడ్మిన్ .
మీ అందరి కోసం పాట మొత్తం lyrics తెలుగు లో మీ కోసం
బలరామ నరసయ్యో Song Lyrics from balagam cinema
శ్రీహరి రాఘవులే ఏ ఏ ఏయ్..
అయ్యో బాలి బాలి బాలి..
అయ్యో బాలి బాలి బాలి..
ఏ దిక్కు పోతున్నవే బాలి..
నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి..
నువ్వున్న జాగ ఇడిసి బాలి..
నువ్వుతిన్న కంచం ఇడిసి బాలి..
నువ్ పన్న మంచం ఇడిసి బాలి..
ఆటేటు పోతున్నవే బాలి..
గోవిందా గోవిందా..
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో..
బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో..
బలరామ నరసయ్యో..
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో..
బంగారి తోవబట్టి బయలెల్లుతుంటివో…
బలరామ నరసయ్యో…
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో…
బాధంటు లేని సోటు ఎతుక్కుంట పోతివో…
బలరామ నరసయ్యో…
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో…
బాధంటు లేని సోటు ఎతుక్కుంట పోతివో…
బలరామ నరసయ్యో…
తీరు తీరు యేషాలేసి ఎంత అలసి పోయినవో…
తోడురాని మంది కోసం తిప్పలెన్ని మోసినవో…
కట్లు తెంచుకోని నేడు కైలాసం పోతున్నవో…
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో…
బంగారి సావునీది బయలుదేరి పోవయ్యో….
బలరామ నరసయ్యో…
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో…
భూమ్మీద లేని హాయి సచ్చి అనుభవించయ్యో….
బలరామ నరసయ్యో….
బాల మల్లేశా బైలు మల్లేశా…
బాల మల్లేశా బైలు మల్లేశా…
రాంగ రాంగ ఏమి తేమురో కొడుకా…
పొంగ ఏమి కట్క పోమురో కొడుకా…
బాల మల్లేశా బైలు మల్లేశా….
బాల మల్లేశా బైలు మల్లేశా…
తొమ్మిది తొర్రలురో కొడుకా…
ఒళ్లు ఉత్త తోలు తిత్తిరో కొడుకా..
బాల మల్లేశా బైలు మల్లేశా..
కూడగట్టుకొనె బలుగము కొడుక…
ఒంటి పిట్ట లెక్క పోతము కొడుకా…
నాలుగొద్దులీడ ఉంటము కొడుకా…
పైన ఉంది నీది దేశము కొడుకా…
బాల మల్లేశా బైలు మల్లేశా…
బాల మల్లేశా బైలు మల్లేశా…
సుక్కల్లాంటి సుక్కల్లో…
ఏగు సుక్క నువ్వయ్యి….
మా కండ్ల ముందే ఉంటావు…
మా బాపు కొమురయ్య….
మము కండ్లారా చూస్తుంటావు…
మా బాపు కొమురయ్య…
ముద్దుగ ముస్తాబైనవు…
సావుతో జంట కూడినవు…
ఈ పండుగ పెద్దగ జేస్తామే…
మా బాపు కొమురయ్య…
నిను సంబురంగ సాగ దోలుతమే…
మా బాపు కొమురయ్య…
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో…
అంతలోనే అందరాని దూరమెల్లి పోతివో…
బలరామ నరసయ్యో…
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో…
మా పిలుపు ఇనబడితే ఎనకకొచ్చి పోవయ్యో…
బలరామ నరసయ్యో…
అమ్మఒళ్ళో పండుకున్నట్టు…
సింత లేని నిదురబోతివి…
అగ్గి లోన తానం జేసి…
బుగ్గిలాగ మారిపోతివి…
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో….
పచ్చనైన గూడు ఇడిసి పచ్చివయ్యి పోతివో….
బలరామ నరసయ్యో….
బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో….
పంచ భూతాల కొరకు ప్రేమ కొంచబోతీవో….
బలరామ నరసయ్యో….
ఇలాంటి తెలుగు మెలోడీ సాంగ్స్ lyrics కోసం link క్లిక్ చేయండి.
Image Source:Gulte & filmiforest