ముందుగా మహిళా మూర్తులందరికి “Happy Women\’s Day” (“అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు\”) !!!
హలో ఫ్రండ్స్ !!! గుడ్ మార్నింగ్
ఎందుకో వాళ్లకు విష్ చేస్తూ పోస్ట్ చేద్దాం అనుకునే సరికి వాళ్లకు సంబంధించిన సమస్యలు గుర్తుకొచ్చాయి. అందులో మా పెద్ద అత్తమ్మ(నాన వాలా పెద్ద అక్క) గుర్తుకొచ్చింది. పేరు కొమురవ్వ వయసు ఒక 80 సంవత్సరాలు ఉంటాయి అనుకుంట…. పెళ్లి అయింది(భర్త చనిపోయారు) కానీ పిల్లలు లేరు ,గత కొన్ని సంవత్సరాల నుండి మా నాన్న గారు చూసుకుంటున్నారు,నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు మా అమ్మ డెలివరీ కి వెళ్ళినప్పుడు కూడా నన్ను చూసుకున్న జ్ఞాపకం…. of course ఇప్పుడు మా పిల్లలని కూడా చూసుకుంటుంది. మాకు చిన్న చిన్న పనులకు కూడా సహాయంగా ఉంటుంది. అప్పుడప్పుడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు నాకు కూడా సహాయం చేసేది. అందరికీ పిల్లలు ఉంటారు వాలా అమ్మకి, అక్కకి,office colleagues చేసిన పనులు మెచ్చుకుంటూ wishes పెడతారు ఎందుకో ఇవాళ నాకు ఆమెకు విష్ చేస్తూ ఈ Post చేయాలనిపించింది.
“Happy Women\’s Day” అత్తమ్మ…..
మన రాష్ట్ర ముఖ్యమంత్రి దయవల్ల తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వృధ్యాప పెన్షన్ వస్తుంది. పలు సార్లు పెన్షన్ ను బ్యాంకు నుంచి withdraw చేయడానికి తనని తీసుకొని బ్యాంకు కి వెళతాను … తోడుగా అంటే తనకి వచ్చే పెన్షన్ గురించి కాదండి …. తనని జాగ్రత్తగా బండి పైన తీసుకెళ్లి బ్యాంకు లో withdrawal ఫారం fill చేసి passbook update చేయించి, మా అత్తమ్మ దగ్గర వేలిముద్ర వేపించి డబ్బులు తీసుకునే వరకు సహాయంగా అనమాట. ఇక్కడ ఇంత బ్యాంక్ ప్రాసెస్ ఎందుకు చెప్తున్నాను అంటే,వెళ్ళినప్పుడు అలంటి వృద్ధులు చాల మంది వస్తూవుంటారు… ofcourse చదువురాని వాళ్ళు… బ్యాంకు process తెలియని వారు…. ఎవరు తోడు లేని వారు… ఇంకా మన బ్యాంకు staff గురించి చెప్పాల్సిన పని లేదు (అందారూ కాదండి) వాలా బిజీ వాళ్ళది, పాపం అందరిని బ్రతిమిలాడి లాస్ట్ కి వాళ్ల(వృద్దులు) పని ముగిస్తారు. చదువుకోపోవడం వాలా తప్పు కాదు కానీ చదువుకొని కూడా వాళ్లకు సహాయం చేయకపోవడం మన తప్పు, friends ఇప్పటి నుంచి మీరు బ్యాంకు కి వెళ్ళినప్పుడు ఈలాంటి వాళ్ళు కనపడితే , విసుక్కోకుండా సహాయం చెయ్యండి. వీలైతే వాళ్లకు బ్యాంకు లో దొరికే కొన్ని withdrawal ఫార్మ్స్ (free) ఇచ్చి మల్లి నెల వచ్చినప్పుడు అది వాళ్లకి తెలిసిన వారి సహాయం తో ఫిల్ చేసుకుని రమ్మని చెప్పండి. వృద్దులు మనకి ఎన్నో మంచి…. చెడులు…. నేర్పించిన వాళ్ళు, ఈ చిన్న సహాయం చేసి వాళ్లకి help చేసిన వాళ్లము అవుతాము.
మహిళా మూర్తులందరికి మరొక్క సారి “Happy Women\’s Day”.