IELTS కి విదేశాలకు ఉన్న లింక్ ఏంటి ?
విదేశీ విద్య మరియు ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీలో పని(Digital Marketer) అనుభవంతో, నేను IELTS కి విదేశాలకు ఉన్న లింక్ ఏంటి ? అనే టాపిక్ పైన ఈ పోస్ట్ పెడుతున్నాను. ఒకరు విదేశాలకు వెళ్లడానికి ఎందుకు ఎంచుకుంటారు.
- చిరకాల కల
- విదేశాలలో స్థిరపడటానికి
- స్నేహితులు లేదా బంధువులు విదేశాలలో ఉన్నారు
- అధిక నాణ్యత గల విద్య కోసం
- కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు యోక్క బలవంతం మీధ(ప్రెజర్ కుక్కర్ మూవీ లాగా అనామాటా) Check : Offers on Pressure Cookers
- టూరిస్ట్ లాగా
- బిజినెస్ పని
- పని చెయ్యటానికి
- జీవిత భాగస్వామి విదేశాలలో ఉండడం·
- లేదంటే ఈవెంట్స్ కాని సినిమా షూటింగ్స్ కానీ వెళుతారు
పైన తెలిపిన అన్ని సందర్భాలలో మీకు వీసా అనేది ఇంపార్టెంట్, సో మీరు విదేశాల కి వెళ్ళాలి అంటే తప్పకుండ మీకు వీసా వచ్చి ఉండాలి, మీరు ఏ పర్పస్ కి విదేశాలకి వెళ్దాం అనుకుంటున్నారో ఆ టైపు వీసా(Visa Type & Visa Class) అప్లై చేసుకోవాలి అనమాట.
ఈ వీసా అనేది, మీరు ఏ దేశంకి వెళ్దాం అని అనుకుంటున్నారో ఆ దేశం వాలు ఇస్తారు అనమాట(Embassy).
సో వీసా(Visa) కి అప్లై చేసుకోవాలి అంటే కొద్దిగా ఎక్సపీరియన్సు(Experience) ఉండి వీసా guidelines తెలిసిన consultancies కి అప్రోచ్ (approach)అవ్వాలి.
విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళకి కొన్ని ఫార్మాలిటీస్(Visa Documents) ఉంటాయి. అవి కన్సల్టెన్సీ లో కౌన్సిలర్స్(Counsellors) మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
మీరు ఒకవేళ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కి వెళ్దాం అనుకుంటే మీరు కంపల్సరిగా(Compulsary) కొన్ని ఎగ్జామ్స్(Test’s) రాయాల్సి ఉంటుంది.
ఆ ఇంగ్లీష్ టెస్ట్ లలో మీకు మంచి స్కోర్ రావాలి.
ఆ టెస్టులు ఏంటంటే·
-
IELTS
-
GRE
-
TOEFL
-
PTE
-
SAT
పైన తెలిపిన టెస్టుల్లో ఏదో ఒక టెస్టు మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ మంది ఎంపిక చేసుకునేది ఐ ఈ ఎల్ టి ఎస్ .
ఐ ఈ ఎల్ టి ఎస్ అంటే?
IELTS అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం
మీకు రెండు సంస్థలు ఇండియాలో, ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాయి·
-
IDP
-
British Council(బ్రిటిష్ కౌన్సిల్)
మీరు ఇంగ్లీష్ యొక్క నాలుగు మోడళ్లలో పరీక్షించబడతారు·
- వినడం (Listening)·
- రాయడం (Writing)·
- చదవడం(Reading) మరియు
- మాట్లాడటం(Speaking)
మీ స్కోరు(Score) బ్యాండ్లలో కొలుస్తారు. స్కోరు 1 నుండి 9 వరకు కొలుస్తారు,
Score required in Test :-
IELTS యొక్క ప్రతి మాడ్యూల్‌లో మీరు ఆరు(6 band) పొందాలి, విదేశీ విశ్వవిద్యాలయాలలో సీటు పొందడానికి మీరు IELTS లో మొత్తం 6 బ్యాండ్ పొందాలి. కానీ కొన్ని కళాశాలలు 6 లేదా అంతకంటే తక్కువ బ్యాండ్ స్కోరుతో దరఖాస్తును అంగీకరిస్తాయి కానీ 6 band పొందడం ఉత్తమం.
7 7 7 మరియు 8 IELTS లో ఉత్తమ స్కోరు. అంటే IELTS లో మీరు పఠనంలో 7, రచనలో 7, వినడంలో 7 మరియు మాట్లాడేటప్పుడు 8 స్కోరు పొందాలి.
Test Format:-
ఐ ఈ ఎల్ టి ఎస్ కి రెండు ఫార్మాట్లు ఉన్నాయి.
- కంప్యూటర్ బేస్డ్(Computer based) మరియు మరొకటి
- పేపర్ బేస్డ్(Paper based).
ఆశావహులు చాలా మంది కాగితం ఆధారిత పరీక్ష మాత్రమే తీసుకుంటారు.
విదేశీ విద్యను ప్లాన్ చేసే విద్యార్థులు(Students) IELTS Academic కోసం వెళతారు & వలస(immigration) కోసం చూస్తున్న వ్యక్తులు ఐ ఈ ఎల్ టి ఎస్ జనరల్ (IELTS General) కోసం వెళతారు.
ఐఇఎల్టిఎస్ పరీక్ష ఫీజు(Test Fees) భారతదేశంలో Rs.14500.
ఐ ఈ ఎల్ టి ఎస్ Test Booking :
ఐఇఎల్టిఎస్ టెస్ట్ ఆన్‌లైన్ (Online) లేదా ఇతర అధీకృత శిక్షణా సంస్థల(Authorized Training Institutes) నుండి బుక్ చేసుకోవచ్చు.
ఐఇఎల్టిఎస్ తయారీ(IELTS Preparation) కోసం, శిక్షణా సంస్థలు(Training Institutes) హైదరాబాద్లో రూ .5000 నుండి రూ .12000 వరకు ఫీజు వసూలు చేస్తాయి. టెస్ట్ స్కోరు 2 సంవత్సరాలకు చెల్లుతుంది.
ఈ టెస్ట్ కి మీరు సొంతంగా కానీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా కానీ ప్రిపేర్ అవ్వొచ్చు. ఉత్తమ శిక్షకుడు లేదా శిక్షణా సంస్థను ఎంచుకోండి.
IELTS కి విదేశాలకు ఉన్న లింక్ ఏంటి అంటే…. విదేశాలకు వెళ్లాలని యోచిస్తున్న విద్యార్థి లేదా ఆశావాదులు వీసా పొందడానికి ఐఇఎల్టిఎస్ స్కోరును సమర్పించాలి.