tailoring for ladies

Tailoring for ladies

tailoring for ladies  అని మనలో చాలా మందికి ఒక అపోహ, అసలు ఇందులో నిజమెంత ?

tailoring profession

మనిషి ఒక్క basic నీడ్స్ గురించి చెప్పుకుంటే, మనిషి  జీవించడానికి కావాల్సింది మూడే మూడు.ఏదో హిందీ సినిమా లో చెప్పుకున్నట్టు అవి ఏంటి అంటే

 

1.రోటి, 2.కాపాడ ఔర్ 3.మకన్ (తిండి, బట్ట ఇంకా గూడు) మనిషి కి ముందు గా ఇవి ఉంటే మిగతా వి సమకూర్చుకోవచ్చు… 

 

బట్టలు మనిషికి ఎంత అవసరమో ఆ బట్టలు కుట్టే మనిషి కూడా అంతే ముఖ్యం. 

 

ఇవ్వాళా పోస్ట్ ఒక టైలర్ ఇంకా…  tailoring profession గురించి….

ladies dresses

 

80 వ దశకం వారికి  టైలర్ యొక్క  importance తెలుసు..ఎందుకంటే 80 నుంచి 90 లో వరకు అసలు బట్టలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఒక్క ట్రైలర్ మాత్రమే, పండుగ వస్తుంది అంటే బట్టలు కొనుక్కొని… మీకు తెలిసిన  టైలర్ దగ్గరికి వెళ్లి .. వారికి మన కొలతలు ఇచ్చి 1 వీక్ కి తెచ్చుకొని  పండగ రోజు వేసుకుంటే … ఆ సరదా  నే వేరు… 

 

నాకు తెలిసి  నాకు గుర్తు ఉన్న కొన్ని ప్యాంటు స్టైల్  నేను గుర్తు పెట్టుకుని ఉన్నది  … ప్రేమికుడు  సినిమా చూసి … baagie  ప్యాంటు … బాలీవుడ్ హీరో ని  చూసి parallel  ప్యాంటు… pants

 

తర్వాత ఇంకా జీన్స్ లు …T –  Shirt … లు… రెడీమేడ్ … బట్టలు ..ఇంకా డైరెక్ట్  గా  Tailor కి  మనకు దూరం ని  పెంచేసాయి.. 

 

ఇప్పుడు  కరోనా lockdown వల్ల ..ఎందుకో నాకు గుర్తుకు వచ్చి ..వారి గురుంచి  నా బ్లాగ్ లో రాయాలి అనిపించింది … 

 

చిన్నగా ఉన్నప్పుడు…చాలా సినిమా లో చూసినట్టు … ఒక ఇంటి పెద్ద చనిపోతే .. తల్లి కష్టపడి … బట్టలు కుట్టి ..పిల్లలను బాగా పెంచుతుంది …వారిని ఉన్నత స్థాయిలో  ఉంచుతుంది. 

అసలు బట్టలు  కుట్టి నిజంగా అంత  money earn చెయ్యొచ్చా ? .. ఇలాంటి ప్రశ్నలకి..జవాబులు చూదాం. 

 

Tailor  అంటే ఎవరు ?

 

మీ బట్టలు మీకు బాగా సరిపోయేలా చేయడానికి దర్జీ సహాయపడుతాడు . … టైలర్ అనే పదం లాటిన్ పదం “ taliare” నుండి వచ్చింది, దీని అర్థం “కత్తిరించడం”. దర్జీ అంటే మీ దుస్తుల ను బాగా సరిపోయేలా కత్తిరించి సర్దుబాటు చేసే వ్యక్తి. 

 

Tailoring  అంటే ?

 

టైలరింగ్ అనేది బట్టలు రూపకల్పన ( designing ) చేయడం , కత్తిరించడం, అమర్చడం మరియు పూర్తి చేయడం. 

 

Tailor యొక్క Duties ఏంటి  ?

 

 • దుస్తులు సరిగ్గా సరిపోయేలా కుట్టడం .
 • ఒక నమూనా లేదా డిజైన్ ప్రకారం ఫాబ్రిక్ను కత్తిరించడం. 
 • మార్పులు ఎక్కడ అవసరమో గమనించడానికి వస్త్రాలను గుర్తించడం.
 • హెమ్మింగ్ చేయడం.
 • సూది మరియు దారం ఉపయోగించి కుట్టు machine ద్వారా దుస్తులను కుట్టడం.

tailoring material

ఇంటి నుంచి టైలరింగ్  కోసం కావాల్సిన జ్ఞానం మరియు నైపుణ్యం ?

 

 • కుట్టు మెషిన్  పైన కుట్టడం practice ఉండాలి  
 • tailoring classes  ద్వారా  కుట్టడం  నేర్చుకోండి. …measurement tape
 • Measurement  చేయడం నేర్చుకోండి ,
 • Cutting చెయ్యడం నేర్చుకోండి
 • Designs ని అవగాహన చేసుకోవడం

 

Sewing  Machine యొక్క 7 రకాలు ఏమిటి?sewing machine

 

 

 

 • మెకానికల్ ట్రెడ్ sewing machines.
 • ఎలక్ట్రానిక్ మెకానిక్ కుట్టు యంత్రాలు.
 • మినీ మరియు పోర్టబుల్ యంత్రాలు.
 • కంప్యూటర్ కరించిన లేదా ఆటోమేటెడ్ యంత్రాలు.
 • ఎంబ్రాయిడరీ యంత్రాలు.
 • క్విల్టింగ్ యంత్రాలు.
 • ఓవర్లాకింగ్ లేదా సెర్జర్ యంత్రాలు.

 

Tailor యొక్క జీతభత్యాలు ?

 

ఇప్పుడు కనుకోవడం చాలా కష్టం కానీ.. నా అంచనా ప్రకారం అన్ని ఖర్చులు పోను ఒక 30000/- వేలు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు tailoring అంటే ఎక్కువగా ladies మాత్రమే కుట్టించుకుంటున్నారు.. ఒక్క బ్లౌజ్ కుడితే 300 నుంచి 3000 వేలు వరకు బిల్ వేస్తున్నారు.. ఈ అందులో ఇంకా ఏవేవో designs ..మొన్న ఈ మధ్య ఏదో పెళ్లి కోసం షాపింగ్ చేస్తే తెలిసింది. 

 

మగవాళ్లకు ఇప్పుడు tailors కోసం చూసేది చాలా తక్కువ ఎందుకంటే బట్టలు కొనుక్కొని సైజు ఇచ్చి తీసుకునే వరకు వారం పడుతుంది… అదే రెడీమేడ్ ఐతే ఇలా వెళ్లి….  ఇలా తీసుకొని రావచ్చు. కానీ దాని quality దానిదే అనుకోండి. 

 

అలా అని tailoring వృత్తి లేదు అని కాదు ..readymade dresses అయినా కుట్టడానికి ఒక tailor నే కావలి.. కానీ ఇక్కడ తన కు వచ్చేది … జీతం మాత్రమే … 

Ladies Tailors

ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు “tailoring అంటే tailoring for ladies” అని confirm  గా చెప్పుకోవచ్చు.. ఇప్పుడు gents… tailors అని కనపడే….. షాపులు చాలా తక్కువ.. అదే లేడీస్ tailors అని ప్రతి గల్లీకి … ప్రతి ఇంటికి బోర్డు పెట్టేస్తున్నారు… 

 

ఫైనల్ గా చెప్పేది “మగువలు మహారాణులు” …. మగ  tailors జీతానికి పని చేస్తున్నారు.. ఆడవారు మాత్రం సొంతం గా  షాప్  పెట్టుకొని తైలారింగ్ వృత్తి లో కొనసాగుతున్నారు.. 

 

మంచి ఫాషన్ designers గా ఎదుగుతున్నారు  అందుకే అన్నాను  “tailoring for ladies”…

 

 ఎవరిని కించపరచడానికి ఈ పోస్ట్ కాదండి… కానీ tailoring వృత్తి లో ఉన్న నా…   సోదరిమనులకు “all the best” చెబుతూ .. ఇంకా మంచిగా రాణించి పైకి రావాలి అని కోరుకుంటున్నాను… ఒక టైలర్ కూడా , software engineer  లాగ ,ఇంట్లో  ఉంది  “work  from  home” కూడా చేసుకోవచ్చు.. 

 

ఒక వేళ మీ కుట్టు మిషన్ repair కానీ services కానీ కావాలి అనుకుంటే… 15 సంవత్సరాలుగా  అదే వృత్తిలో ఉన్న మా బామ్మర్ది ని  contact  చెయ్యొచ్చు ( Hyderabad/Secunderabad చుట్టూ పక్కన ఒక 10 kms వరకు మాత్రమే ). 

ladies garments

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.